రామాలయంలో ముగిసిన నవమి వేడుకలు

రామాలయంలో ముగిసిన నవమి వేడుకలు

CTR: పుంగనూరు పట్టణం బజారు వీధిలోని రామాలయంలో నవమి వేడుకలు ముగిశాయి. ఇందులో భాగంగా సోమవారం సీతారాముల ఉత్సవమూర్తులను వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి అర్చకులు పూజలు నిర్వహించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో తిరుప్పావడ సేవ చేపట్టారు. ఈ కార్యక్రమాలను ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.