గుండ్రాంపల్లిని సందర్శించిన జిల్లా అధికారులు
NLG: చిట్యాల మండలం గుండ్రాంపల్లి లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా పరిషత్తు సీఈవో శ్రీనివాసరావు, హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ రాజ్ కుమార్‌లు గురువారం సందర్శించారు. కొనుగోలు వేగవంతం చేయాలని సిబ్బందికి సూచించారు. రైతులతో మాట్లాడి పరిస్థితులను తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను వారు పరిశీలించారు.