మందు బాబులకు అడ్డాగా మారిన రైతు వేదిక

సూర్యాపేట: అన్నదాతలకు ఆసరాగా ఉంటుందని ప్రభుత్వం రూ. లక్షలు ఖర్చుచేసి రైతు వేదిక నిర్మిస్తే మందు బాబులకు బాసటగా మారిందని చింతలపాలెం మండల కేంద్రానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు వేదికలో రైతుల మీటింగ్స్ జరగకపోయినా మందుబాబుల సిట్టింగ్స్ మాత్రం పగలు రాత్రి తేడా లేకుండా నడుస్తున్నాయని వాపోతున్నారు.