తరచూ అగ్ని ప్రమాదాలు.. ఎర్తింగ్ లేకపోవడమే
HYD: ఇటీవల కాలంలో నగరంలో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్, నిప్పు అంటుకోవడం తదితర కారణాలతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. నిర్లక్ష్యం, ఏమరుపాటు కారణంగానే ఎక్కువ శాతం ప్రమాదాలు జరుగుతుంటాయని అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు జరగడానికి ప్రధాన కారణం ఎర్తింగ్ లేకపోవడమేనని విద్యుత్ అధికారులు అంటున్నారు.