బాలసదనంలో పిల్లలతో కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే

బాలసదనంలో పిల్లలతో కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే

SRD: నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ సంజీవరెడ్డి తన పుట్టినరోజు పురస్కరించుకొని పట్టణంలోని బాలసదనంలో పిల్లలతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పిల్లల కోసం తన సొంత ఖర్చులతో ఎల్ఈడీ టీవీని బహుకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన పుట్టినరోజును పిల్లల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.