ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

KDP: మహిళలకు ఇచ్చిన మాట సీఎం చంద్రబాబు నిలుపుకున్నారని MLA పుత్తా చైతన్యరెడ్డి పేర్కొన్నారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగమైన శక్తి పథకాన్ని చంద్రబాబు ప్రారంభించారు. అందులో భాగంగా కమలాపురంలో మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణాన్ని ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి ప్రారంభించారు. అనంతరం మహిళల సంక్షేమాన్ని కోరుకునేది చంద్రబాబేనని ఆయన అన్నారు.