ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ. 17లక్షల విరాళం

TPT: ప్రముఖ నిర్మాణ సంస్థ 'వారాహి' అధినేత సాయి కొర్రపాటి టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు గురువారం రూ.17లక్షలు విరాళంగా అందించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ అదనపు ఈవో సి. హెచ్. వెంకయ్య చౌదరికి డీడీని అందజేశారు. ఈ విరాళాన్ని భక్తులకు మధ్యాహ్నం భోజనం కోసం ఉపయోగించాలని ఆయన కోరారు.