ప్రతిష్టాత్మకంగా 'చదవడం మాకిష్టం' కార్యక్రమం

ప్రతిష్టాత్మకంగా 'చదవడం మాకిష్టం' కార్యక్రమం

BPT: సంతమాగులూరు గ్రంథాలయ శాఖలో ఆదివారం 'చదవడం మాకిష్టం' కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు సత్ప్రవర్తన, చదువు యొక్క విశిష్టతను వివరించినట్లు గ్రంథాలయ ఛైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి తెలిపారు. ప్రతి ఆదివారం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని, మొత్తం 15 మంది విద్యార్థులు పాల్గొన్నారని ఆయన పేర్కొన్నారు.