డంపింగ్ యార్డ్ తీసేయాలని గ్రామస్థుల ధర్నా

డంపింగ్ యార్డ్ తీసేయాలని గ్రామస్థుల ధర్నా

NLG: కనగల్ మండలం గ్రామం దోరెపల్లి ఎస్సీ కాలనీలో నివాసాలకు కేవలం 32 మీటర్ల దూరంలోనే డంపింగ్ యార్డ్‌ను ఏర్పాటు చేశారని స్థానికులు చెప్పారు. ఓ వైపు కుళ్లిన వాసన, మరో వైపు దోమలతో ఇబ్బందులు పడుతున్నామని వారు అంటున్నారు. డంపింగ్ యార్డును మరో చోటుకు తరలించాలని సోమవారం గ్రామ పంచాయతీ ఎదుట ధర్నా నిర్వహించి కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చారు.