'నేటి నుంచి HPV వ్యాక్సినేషన్ ప్రారంభం'
KMM: మహిళా ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఆదివారం నుంచి 14-15 ఏళ్లలోపు బాలికలకు హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టనున్నట్లు డీఎంహెచ్‌వో డా. రామారావు తెలిపారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్వజన ఆసుపత్రిలో కలెక్టర్ దురిశెట్టి అనుదీప్‌తో కలిసి వ్యాక్సినేషన్ ప్రక్రియను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభిస్తారని ప్రకటించారు.