రేపు ఈ ప్రాంతాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం

భూపాలపల్లి: జిల్లా కేంద్రంలోని బస్టాండ్ రోడ్ నుండి 5 ఇంక్లైన్ మధ్యలో గురువారం 33 కేవి లైన్ పనులు చేపట్టనున్నట్లు ఏఈ విశ్వాస్ రెడ్డి తెలిపారు. పనుల కారణంగా రెడ్డికాలని, రాంనగర్, సుభాష్ కాలనీ, ఎల్బీ నగర్, లక్ష్మి నగర్, బానోత్ వీధి, బస్టాండ్ నుండి ఓసీపి 2 రోడ్, పాత జంగేడు పరిధిలో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.