కోడ్ అమల్లో ఉన్నా జిల్లాలో బెల్టుషాపుల జోరు
BHNG: ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా జిల్లాలో బెల్టు షాపులు విచ్చలవిడిగా నడుస్తున్నాయి. ఎన్నికలు జరుగుతున్నా పల్లె, పట్నం తేడా లేకుండా బెల్ట్ షాపుల్లో మద్యం ఏరులై పారుతున్నది. ఎక్కడ చూసినా పర్మిట్ రూమ్‌లు, బార్లను తలపిస్తున్నాయి. గతంలో కోడ్ రాగానే బెల్టు దుకాణాలపై ఉకుపాదం మోపేవారు. ఇప్పుడు యధేచ్ఛగా దందా సాగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు.