ఆటోనగర్లో పర్యటించిన మున్సిపల్ ఛైర్మన్

ఆటోనగర్లో పర్యటించిన మున్సిపల్ ఛైర్మన్

సత్యసాయి: హిందూపురం పట్టణం ఆటోనగర్లో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు కోరడంతో ఆ ప్రాంతాన్ని మున్సిపల్ ఛైర్మన్ డీఈ రమేష్ శుక్రవారం పర్యటించారు. వెంటనే ఆరు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఆటోనగర్‌లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. అలాగే తాగునీటి సమస్య కోసం కొత్తగా పైపులైను వేశారు.