రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

అనకాపల్లి పట్టణం నూకాంబిక అమ్మవారి ఆలయ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పరవాడ మండలం తిక్కవానిపాలెంకు చెందిన సూరాడ సోములు(58) బైక్ పై ఆలయానికి వస్తుండగా లారీ ఢీకొంది. ప్రమాదంలో గాయపడిన సోములను అనకాపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించి విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్తుండగా మృతి చెందాడు.