జిల్లాలో భానుడి భగభగ
ఆసిఫాబాద్ జిల్లాలో 24 గంటల్లో పలు మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సిర్పూర్ (టి)లో అత్యధికంగా 42.9 డిగ్రీలు నమోదు కాగా, కెరమెరి 42.8, ఆసిఫాబాద్ 42.2, కాగజ్ నగర్ 42.1 డిగ్రీలు నమోదయ్యాయి. దహెగాం 41.7, పెంచికల్ పేట్ , రెబ్బెన 41.3, వాంకిడిలో 41.2 డిగ్రీలతో వేడి తీవ్రత కొనసాగుతోంది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.