రైతుల పరిస్థితి దారుణంగా ఉంది: YCP ఎమ్మెల్సీ
AP: కూటమి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేవని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. రైతుల పేరుతో తెచ్చిన రూ.3 వేల కోట్లు ఏమయ్యాయని అప్పిరెడ్డి ప్రశ్నించారు.