కంగ్టి లో అత్యధిక వర్షపాతం నమోదు

SRD: జిల్లాలో అత్యధికంగా కంగ్టి మండలంలో 1.69 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు సోమవారం ప్రకటించారు. నిజాంపేట- 1.30, కల్హేర్- 1.19, సిర్గాపూర్- 1.07, ఆందోలు- 1.03 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైనట్లు తెలిపారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు.