'108 అంబులెన్స్ ఏర్పాటు చేయండి'
VKB: మర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో 108 అంబులెన్స్ లేదు. అత్యవసర సమయంలో మెరుగైన చికిత్స కోసం పట్టణాలకు వెళ్లాలంటే ప్రైవేటు అంబులెన్స్‌లను ఆశ్రయించాల్సి వస్తోంది. అంబులెన్స్ రవాణా ఖర్చు భారంగా మారడంతో పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికంగా అంబులెన్స్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.