'మాదకద్రవ్య రహిత సమాజం కొరకు కృషి చేయాలి'
ASR: అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. గంజా, డ్రగ్స్ వంటి మత్తు పదార్ధాల వలన కలుగు దుష్ఫలితాలను వివరించి, వాటికి దూరంగా ఉండాలని ప్రిన్సిపాల్ డా. కేబీకే నాయక్ తెలిపారు. మాదకద్రవ్య రహిత సమాజం కొరకు కృషి చేయాలని విద్యార్ధులతో ప్రతిజ్ఞ చేయించారు. రవ్వలగుడ జంక్షన్ వరకు నషా ముక్త అవగాహన ర్యాలీ చేపట్టారు.