ఇంటర్ విద్యార్థి డీబార్

ఇంటర్ విద్యార్థి డీబార్

ప్రకాశం: రాచర్ల మండలం ఆకవీడు గ్రామానికి చెందిన ఓ విద్యార్థి సోమవారం ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో మాస్ కాపీకు పాల్పడి డీబార్ అయిన ఘటన జరిగింది. యాజమాన్యం తెలిపిన వివరాల మేరకు కంభం మండలం తురిమెళ్ళలో గల కళాశాలలో సోమవారం జరిగిన ఇంటర్ పరీక్షలో ఓ విద్యార్థి మైక్రో జిరాక్స్‌తో పట్టుబడ్డాడని అన్నారు. వెంటనే విద్యార్థిని డీబార్ చేసినట్లు యాజమాన్యం తెలిపారు.