సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా?
ఆర్థిక, అత్యవసర కారణాలతో కొందరు సెకండ్ హ్యాండ్ ఫోన్స్ కొంటుంటారు. అలా కొనే ముందు ఫోన్ ఎప్పుడు కొన్నది? టచ్ పనిచేస్తుందా? బ్యాటరీ కండీషన్ ఏంటి? కెమెరా బాగానే ఉందా? సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ వస్తాయా? అని క్రాస్ చెక్ చేసుకోవాలి. అలాగే ఫోన్ కొన్నప్పటి బిల్స్ అడగాలి. అవి లేవంటే దొంగిలించిన ఫోన్ అయ్యుండే ఛాన్స్ ఉంది.