చెరువు భూములను కబ్జా చేస్తే చట్టరీత్యా చర్యలు

చెరువు భూములను కబ్జా చేస్తే చట్టరీత్యా  చర్యలు

JGL: గ్రామాల్లోని చెరువు భూములను కబ్జా చేస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని పెగడపల్లి తహసీల్దార్ ఆనంద్ కుమార్ హెచ్చరించారు. మంగళవారం మండలంలోని కీచులాటపల్లి, మ్యాకవెంకయ్య పల్లి గ్రామాల్లోని చెరువులను ఆయన పరిశీలించారు. ప్రభుత్వ భూములను, ముఖ్యంగా జలవనరులైన చెరువులను ఆక్రమించి సాగు చేసినా లేదా నిర్మాణాలు చేపట్టినా సహించేది లేదని స్పష్టం చేశారు.