'అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి'

'అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి'

KDP: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా, గురువారం రాత్రి కడప నగరంలోని మహిళా పోలీస్ స్టేషన్ వద్ద అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ సంగీత కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అదనపు SP కె. ప్రకాష్ బాబు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివన్నారు.