కర్నూలు జిల్లాలో వైఎస్ షర్మిళ పర్యటన వాయిదా

KRNL: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర PCC అధ్యక్షురాలు YS షర్మిళ కర్నూలు జిల్లా పర్యటన అనివార్య కారణాలతో వాయిదా పడిందని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ జిలానీ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. షర్మిళ పర్యటన కోసం కాంగ్రెస్ వర్గాలు ముందస్తు ఏర్పాట్లు చేసినప్పటికీ, అనూహ్య పరిస్థితుల నేపథ్యంలో మార్పు చోటుచేసుకున్నట్లు తెలిపారు.