చింతలపూడి ఎత్తిపోతలను పూర్తి చేయండి: మాజీమంత్రి

చింతలపూడి ఎత్తిపోతలను పూర్తి చేయండి: మాజీమంత్రి

AP: చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబును మాజీమంత్రి దేవినేని ఉమా కోరారు. ఈ మేరకు సీఎంకు వినతిపత్రం అందజేశారు. ఈ పథకం ద్వారా ఉమ్మడి కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లోని 4.80 లక్షల ఎకరాలకు సాగు, 35 మండలాలకు తాగునీరు అందించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా పథకాన్ని పూర్తి చేస్తామని మంత్రికి చంద్రబాబు హామీ ఇచ్చారు.