గత 2రోజులుగా నిలిచిన మీ సేవ సేవలు
ఆసిఫాబాద్ జిల్లాలోని మీసేవ కేంద్రాల్లో 2రోజులుగా సర్వర్ పనిచేయకపోవడంతో పౌర సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం కేంద్రాలకు వచ్చిన లబ్ధిదారులు గంటల తరబడి వేచి ఉండి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా స్థానిక ఎన్నికలు, విద్యా సంబంధిత అవసరాల కోసం వచ్చిన వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.