సైబర్ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమం

సైబర్ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమం

ASR: డుంబ్రిగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం సైబర్ క్రైమ్స్, గంజాయి నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అరకు సీఐ హిమగిరి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు సైబర్ మోసాలు, వాటి నివారణ చర్యలు, గంజాయి వ్యసనం వల్ల కలిగే ఇబ్బందులు గురించి వివరంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై పాపినాడు తదితరులు పాల్గొన్నారు.