ఉప్పల్ నుంచి తొర్రూరుకు డైరెక్ట్ బస్

ఉప్పల్ నుంచి తొర్రూరుకు డైరెక్ట్ బస్

మేడ్చల్: ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి రోజురోజుకు మహాలక్ష్మి పథకం కింద ప్రయాణించే వారి సంఖ్య పెరగడంతో ఆర్టీసీ అధికారులు అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నారు. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి తొర్రూర్ వైపు ఉదయాన్నే 5:06 గంటలకు ఆర్టీసీ బస్ నడిపిస్తున్నట్లు వివరించారు. రాబోయే 30 రోజులు పరిశీలించి, మరిన్ని నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తామని వివరించారు.