రోడ్డు మధ్యలో కరెంటు స్తంభం
KMR: దోమకొండలోని మూడో వార్డు శాంతినగర్లో సీసీ రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్తు స్తంభం ప్రజలకు శాపంగా మారింది. రహదారిపై వాహనాల రాకపోకలకు, బాటసారుల నడకకు ఈ స్తంభం తీవ్ర అంతరాయం కలిగిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరిగే అవకాశమున్నందున, అధికారులు వెంటనే స్పందించి ఆ స్తంభాన్ని రోడ్డు పక్కకు తొలగించాలని కోరుతున్నారు.