విద్యుదాఘాతంతో ముంచుకొచ్చిన మృత్యువు
VSP: ఇసకలపాలెం గ్రామంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. షెడ్డు నిర్మాణానికి జేసీబీతో స్తంభాన్ని నిలబెట్టే క్రమంలో పైనున్న విద్యుత్ తీగలకు తాకడంతో ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. సూరీడు, శ్రీను అనే ఇద్దరు వ్యక్తులు విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతి చెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.