మదనపల్లెలో ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్

మదనపల్లెలో ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్

కడప: మదనపల్లెలో బైకులను చోరీచేస్తున్న దొంగను అరెస్టు చేసినట్లు మదనపల్లె 1టౌన్ ఎస్సై అన్సర్ బాష తెలిపారు. పట్టణంలోని నెహ్రూ వీధిలో కాపురం ఉండే సయ్యద్ బాబుసాహెబ్ కొడుకు సయ్యద్ అఫ్జల్(48) బెంగళూరు బస్టాండ్ ఉర్దూ స్కూల్ వద్ద చెప్పుల వ్యాపారం చేసేవాడు. అప్పుడప్పుడు సయ్యద్ అఫ్జల్ బైకులను దొంగిలిస్తూ పోలీసులకు పట్టుబడడంతో 8 బైకులను సీజ్ చేసి అరెస్టు చేశారు.