VIDEO: శత జయంతి వేడుకలకు ముస్తాబైన పుట్టపర్తి
సత్యసాయి: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల కోసం పుట్టపర్తి పట్టణం పూర్తిగా ముస్తాబైంది. ఈ నెల 18 నుంచి 23 వరకు జరగనున్న ఈ వేడుకల కోసం వీధుల్లో రంగురంగుల విద్యుత్ లైట్ల వెలుగులు ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాలకు దేశవిదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. భక్తుల కోసం ట్రస్ట్ సభ్యులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు.