VIDEO: మేకల మందపై కుక్కల దాడి

VIDEO: మేకల మందపై కుక్కల దాడి

RR: చేవెళ్లలో కుక్కల దాడి కలకలం రేపింది. దేవునిఎర్రవల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీశైలం మేకల మందపై కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. ఈ ఘటనలో 23 మేకలు ప్రాణాలు కోల్పోగా, సుమారు రూ. 2 లక్షల మేర నష్టం వాటిల్లింది. జీవనాధారాన్ని కోల్పోయిన రైతు శ్రీశైలం.. ప్రభుత్వం తనను ఆదుకోవాలని వేడుకున్నాడు. పెరుగుతున్న కుక్కల బెడదపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.