వేధింపులు భరించలేక భర్తను హత్య చేసిన భార్య

వేధింపులు భరించలేక భర్తను హత్య చేసిన భార్య

MNCL: మందమర్రిలోని రాజీవ్ నగర్‌లో భర్తను భార్య హత్య చేసిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. మృతుడు మాటేటి చంద్రయ్య తరచూ మద్యం సేవించి తన భార్య లక్ష్మి, కుమార్తెను కొట్టేవాడు. ఈ వేధింపులు భరించలేక లక్ష్మి స్టీల్ రాడ్‌తో చంద్రయ్య తలపై పలుమార్లు బలంగా కొట్టడంతో అక్కడిక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న సీఐ శశిధర్ రెడ్డి, ఎస్సై రాజశేఖర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.