'ప్రజలకు ఆశాజ్యోతి అంబేద్కర్'
NLG: పేద, మధ్యతరగతి ప్రజలకు ఆశాజ్యోతిగా ఉన్న డా. బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు అన్ని వర్గాల ప్రజలు కృషి చేయాలని సీపీఎం సీనియర్ నాయకులు బొంతల చంద్రారెడ్డి అన్నారు. చిట్యాల మండలం వెలిమినేడులో అంబేద్కర్ వర్థంతి సందర్భంగా ఇవాళ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. అందరికీ ఓటు అనే ఆయుధాన్ని ఆయన ఇచ్చారని కొనియాడారు.