VIDEO: తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన కలెక్టర్
భూపాలపల్లి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఐడీవోసీ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ శర్మ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి, పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.