గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి: సీఐ

KMR: గణేశ్ నవరాత్రులను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి కోరారు. గణేశ్ ఉత్సవ నిర్వాహకులతో పట్టణంలో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మండపాల నిర్వాహకులు తమ వివరాలు స్థానిక పోలీస్స్టేషన్లలో నమోదు చేయించుకోవాలని సీఐ సూచించారు.