ప్రత్యేక అలంకారంలో శ్రీ విరుపాక్షి మారమ్మ దర్శనం

ప్రత్యేక అలంకారంలో శ్రీ విరుపాక్షి మారమ్మ దర్శనం

CTR: పుంగనూరు పట్టణం మున్సిపల్ బస్టాండ్ సమీపానగల శ్రీ విరుపాక్షి మారెమ్మ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనం భాగ్యం కల్పించింది. అర్చకులు ఉదయాపూర్వమే సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొల్పి అభిషేకాలు నిర్వహించారు. తర్వాత ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.