దర్శిలో ప్రయాణికులకు తప్పిన ప్రాణాపాయం

ప్రకాశం: దర్శి మండలం కొత్తరెడ్డి పాలెం గ్రామం వద్ద గురువారం అర్ధరాత్రి ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్ అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకు వెళ్ళింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.