ఎన్నికల కోలాహలం.. రిజర్వేషన్లపై అయోమయం

ఎన్నికల కోలాహలం.. రిజర్వేషన్లపై అయోమయం

 KMM: డిసెంబరులో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయన్న ప్రభుత్వ ప్రకటనతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం మొదలైంది. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేయాలని ఆశిస్తున్న ఆశావహులు ఇప్పటికే గ్రామాల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు కార్యక్రమాలను ప్రారంభించినట్లు సమాచారం. అయితే, రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో వారిలో అయోమయం నెలకొంది.