ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్
కృష్ణా: గన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బాలాజీ, ఎమ్మల్యే యార్లగడ్డ వెంకట్రావు నిన్న రాత్రి ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, రోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. స్త్రీల వార్డులో బాలింతలతో మాట్లాడి, వైద్యుల సేవలు, పరిశుభ్రత గురించి అడిగి తెలుసుకున్నారు.