VIDEO: పెళ్లిబృందంపై తేనెటీగల దాడి

VZM: కురుపాంలో శుక్రవారం పెళ్లి ఊరేగింపుతో వెళ్తున్న వారిపై తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ దాడిలో సుమారు 35 మందికి గాయాలయ్యాయి. గాయాలైన వారికి కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం అందిస్తున్నారు. ఒకరి పరిస్థితి విషమంగ ఉండగా.. పార్వతిపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు.