రేపు బాసర ఆలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన
TG: CM రేవంత్ రేపు నిర్మల్ జిల్లాలోని బాసర ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.225 కోట్లతో చేపడుతున్న ఈ నిర్మాణ పనుల అనంతరం ఆలయ విస్తీర్ణం 3 రెట్లు పెరగనుంది. పునర్నిర్మాణంలో భాగంగా 9 అంతస్థుల రాజగోపురం, ఈశాన్యంలో కోనేరు తదితరాలను నిర్మించనున్నారు. శృంగేరి పిఠాధిపతుల అనుమతితో ఈ పనులు చేపట్టారు.