ఏకగ్రీవమైన సర్పంచ్, వార్డు స్థానాలు

ఏకగ్రీవమైన సర్పంచ్, వార్డు స్థానాలు

MNCL: దండేపల్లి మండలంలోని కొండాపూర్ గ్రామపంచాయతీలో సర్పంచ్, వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయని ఆర్వోలు వెల్లడించారు. బుధవారం పంచాయతీలో నిర్వహించిన నామినేషన్ల ఉపసంహరణ తర్వాత సర్పంచ్‌గా ఇప్ప రవళి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అన్నారు. అలాగే 8 వార్డులు కూడా ఏకగ్రీవం అయ్యాయని ఆర్వోలు వెల్లడించారు. సర్పంచ్ వార్డు స్థానాలు ఏకగ్రీవం కావడంపై అందరూ హర్షం వ్యక్తం చేశారు.