అగ్ని ప్రమాదం.. షుగర్ ఫ్యాక్టరీలో మంటలు
E.G: జిల్లాలోని రాయవరం మండలం చెల్లూరులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సర్వరాయ షుగర్ ఫ్యాక్టరీలో మంటలు ఎగసిపడుతున్నాయి. వెల్డింగ్ పనులు చేస్తుండగా ఈ మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.