కూకట్‌పల్లి రేణు కేసు.. ఆ ఇద్దరూ ఎక్కడ?

కూకట్‌పల్లి రేణు కేసు.. ఆ ఇద్దరూ ఎక్కడ?

TG: కూకట్ పల్లిలో దారుణ హత్యకు గురైన రేణు అగర్వాల్ కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. రేణును బంగారం, నగదు కోసం జార్ఖండ్‌కు చెందిన వంటమనిషి, అతని స్నేహితుడు చిత్రహింసలకు గురిచేసి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. అనంతరం రక్తపు మరకలు అంటిన దుస్తులను అక్కడే వదిలేసి.. శుభ్రంగా స్నానం చేసి డబ్బు, నగలతో ఆమె స్కూటిపైనే పారిపోయారు. ఆ నిందితుల కోసం 5బృందాలుగా పోలీసులు గాలిస్తున్నారు.