నేడు ఈ ప్రాంతాల్లో కరెంట్ కట్
ప్రకాశం: విద్యుత్ మరమ్మతుల దృష్ట్యా తిరుపతిలోని పలు ప్రాంతాల్లో నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ ఈఈ గంగాధర్ రెడ్డి తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ఉదాయి ఇంటర్నేషనల్ హోటల్, మారుతి హాస్పిటల్, రైల్వే HT, TTD రెండవ సత్రం, గాంధీపురం, వెంకట రెడ్డి కాలని తదితర ప్రాంతాల వినియోగదారులు సహకరించాలన్నారు.