గుర్తుతెలియని మృతదేహం లభ్యం

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

NDL: కోయిలకుంట్ల మండలం భీమునిపాడు గ్రామ సమీపంలో ఉన్న కుందూనదిలో శనివారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమయింది. మృతుడు తెల్లటి జిబ్బ ధరించి ఉన్నాడని స్థానిక పోలీసులు తెలిపారు. మృతదేహం ఉబ్బిపోవడంతో గుర్తించలేకపోతున్నామని ఎస్సై మల్లికార్జున అన్నారు. నంద్యాల వైపు నుంచి కుందూ నదిలో కొట్టుకొని వచ్చినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.