VIDEO: కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం
JGL: కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అర్థరాత్రి 30 దుకాణాల్లో మంటలు చెలరేగాయి. నిమిషాల్లోనే సమీప షాపులకు మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 20కి పైగా బొమ్మల దుకాణాలు పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. కాగా.. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.