VIDEO: విషాదం.. తల్లి, బిడ్డ మృతదేహాలు లభ్యం
WGL: వర్ధన్నపేట మండలం కట్య్రాల గ్రామానికి చెందిన కామిండ్ల కళ్యాణి (30) తన మూడేళ్ల కుమారుడు శ్రేష్యాన్ష్‌తో కలిసి ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాలువలో దూకి మృతి చెందిన ఘటన విషాదం కలిగించింది. శనివారం జరిగిన ఈ ఘటనలో, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి కుమ్మరిగూడెం శివారులో వారి మృతదేహాలను గుర్తించారు. ఈ విషయాన్ని ఎస్సై సాయిబాబు వెల్లడించారు.